మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధం: ఎస్పీ
అన్నమయ్య: 18 ఏళ్లలోపు గల మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని SP ధీరజ్ హెచ్చరించారు. నిన్న రాయచోటిలోని తన కార్యాలయంలో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్రవాహనాలు లేదా ఇతర వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని అన్నారు. లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు.