జిల్లాకు చేరుకున్న మంత్రి పొన్నం
NZB: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. బుధవారం రోడ్డు రవాణా శాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. కాగా జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రిని నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.