VIDEO: గుంతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
WGL: నర్సంపేట నుంచి మాదన్నపేట వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులను నరకయాతనకు గురిచేస్తోంది. భారీ గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లబెల్లి వెళ్లే కొన్ని బస్సు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయడంతో విద్యార్థులు, గ్రామీణులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. రోడ్డు తక్షణమే మరమ్మత్తు చేపట్టాలని కోరారు.