ట్రంప్‌కు ఇరాన్ 'బిగ్ గిఫ్ట్'

ట్రంప్‌కు ఇరాన్ 'బిగ్ గిఫ్ట్'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ నుంచి తమకు ఓ పెద్ద కానుక అందిందని ప్రకటించారు. ఇరాన్ 10 ఆయిల్ ట్యాంకర్లను USకు పంపిందని, హర్మూజ్ జలసంధి వద్ద ఎటువంటి టోల్ ఛార్జీలను వసూలు చేయలేదని ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని, ఇది సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.