కిశోర బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

KDP: కిశోర బాలికల వికాస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిద్దవటం మండలంలోని మాచుపల్లి అంగన్వాడి కేంద్రంలో కిషోర వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ పోలీసు సాయి దివిజ యుక్త వయసు గల బాలికలకు కౌమార దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీడియో ద్వారా వివరించారు. ఆడపిల్లలను 18 సంవత్సరాల వరకు చదివించాలని అనంతరమే వివాహం జరిపించాలని తల్లిదండ్రులకు సూచించారు.