సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

KMM: జిల్లాలో CPM మరో సీనియర్ నేతను కోల్పోయింది. కూసుమంచి మండలం కోక్యాతంగాకు చెందిన హలావత్ బిక్షం నాయక్ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గిరిజన సంఘం నాయకులు విచారం వ్యక్తం చేశారు. సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతంరం మాట్లాడుతూ.. బిక్షం నాయక్ మృతి పార్టీకి తీరని లోటన్నారు.