సీనియర్ జర్నలిస్ట్ సురేష్ బాబు మృతి

సీనియర్ జర్నలిస్ట్ సురేష్ బాబు మృతి

GNTR: తెనాలికి చెందిన సీనియర్ పాత్రికేయులు, ఫ్రీ లాన్సర్ బచ్చు సురేష్ బాబు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. భౌతికకాయాన్ని పాత సత్యనారాయణ టాకీస్ రోడ్డులోని ఆర్యవైశ్య అపరకర్మశాలలో సందర్శనార్థం ఉంచినట్లు బంధువులు మంగళవారం తెలిపారు. ఆయన గతంలో కొన్ని పత్రికలతో పాటు ఓ కేబుల్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు.