వాహనదారులకు DOUBLE SHOCK

వాహనదారులకు DOUBLE SHOCK

20 ఏళ్లకు పైబడిన వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఛార్జీని కేంద్రం భారీగా పెంచింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం 20 ఏళ్లు దాటిన తేలికపాటి వాహనాలకు(LMV) ఈ రుసుము రూ.5,000 నుంచి రూ.10,000కు పెరిగింది. బైక్‌లకు రూ.1,000 నుంచి రూ.2,000కు, త్రీవీలర్లకు రూ.3,500 నుంచి రూ.5,000కు పెంచారు. దిగుమతి చేసుకున్న వాహనాలకు ఈ ఛార్జీ ఇంకా ఎక్కువగా ఉంది.