యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు
HNK: కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని స్టేషన్ ఘనాపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. వేలేరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని రాజయ్య తనిఖీ చేశారు. యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులు తమ గోడును రాజయ్యకు విన్నపించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.