రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

TPT: శ్రీకాళహస్తి మండలంలో రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. జైహింద్ పురానికి చెందిన కుమార్ (27) కోకాకోలా కంపెనీలో పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి డ్యూటీ ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరాడు. నాయుడుపేట హైవేపై వీఎం పల్లి దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. మరో ఐదారు నిమిషాలు ఉంటే ఇంటికి వెళ్లేవాడు. ఈ లోపే యాక్సిడెంట్ జరిగింది.