విద్యార్థులకు వైద్య పరీక్షలు

విద్యార్థులకు వైద్య పరీక్షలు

JN: దిక్సూచి కార్యక్రమంలో భాగంగా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ హరికృష్ణ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రాబోయే చలి కాలంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.