ఇంటర్ పరీక్షల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్

ఇంటర్ పరీక్షల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్

జనగాం: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణను కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. జనగామ పట్టణం ధర్మకంచలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో హాజరైన విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.