బల్లిపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

బల్లిపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

ప్రకాశం: కనిగిరి మండలం బల్లిపల్లిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కనిగిరి ఇంఛార్జ్ వరికూటి నాగరాజు జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొండలరావు, జనసేన సీనియర్ నాయకులు నాయబ్ రసం, మధు నాయుడు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.