బీజేపీ ఆప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది: మేయర్

బీజేపీ ఆప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది: మేయర్

KMM: గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ ఆప్రజాస్వామ్య పాలన సాగిస్తోందని మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం ఖమ్మం 46, 48వ డివిజన్‌లో చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.