ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మినట్లయితే ప్రభుత్వం ద్వారా సరైన గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.