మాధవరం-1లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

మాధవరం-1లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో శుక్రవారం పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మీనరసయ్య డోజర్‌తో చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డుకు ఇరువైపులా పారిశుద్ధ్య పనులను నిర్వహించామన్నారు.