'చేటీ చంద్' వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి
KNR: కరీంనగర్‌లో సింధీ సమాజం ఇవాళ జరుపుకున్న 'చేటీ చంద్' (నూతన సంవత్సర) వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. సింధీల ఆరాధ్య దైవం భగవాన్ ఝూలేలాల్ జీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన సందడి చేశారు. మానవత్వం, ధైర్యం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఝూలేలాల్ జీ సందేశం అందరికీ అనుసరణీయమని కొనియాడారు.