‘గ్రామంలోనే రెవిన్యూ సమస్యల పరిష్కారం’
PPM: ప్రజలు తమ రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, మండల కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే పరిష్కారం అందించేందుకు ‘విలేజ్ రెవిన్యూ క్లినిక్’ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఇవాళ విక్రమపురం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించారు.