లివర్ బాధితులకు నిమ్స్ భరోసా.. త్వరలో అత్యాధునిక చికిత్స

HYD: కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి నిమ్స్ ఆస్పత్రి భరోసా ఇస్తోంది. త్వరలో అత్యాధునిక ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2 నుంచి ఇది పేషెంట్లకు అందుబాటులో ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా కేవలం రీజనరేటివ్ మెడిసిన్‌తో లివర్ పనితీరును మెరుగుపరచవచ్చని ఆయన చెప్పారు.