'మహిళలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం'

'మహిళలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం'

NLR: కూటమి పాలనలో మహిళలకు కనీస రక్షణ కరువైందని వైసీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. హోంమంత్రి మహిళ అయ్యిండి కూడా మహిళలపై దాడులను అరికట్టలేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.