'పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి'

'పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి'

SRD: పటాన్ చెరు మండలంలోని ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి (డీఈవో) వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే తీరును పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని డీఈవో సూచించారు. ఆయన వెంట పాఠశాల హెచ్ఎం, ఉపాద్యాయులు ఉన్నారు.