వసతి గృహాల్లో స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం: కలెక్టర్

వసతి గృహాల్లో స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సీఎస్ఆర్ నిధుల కింద అందజేసిన నాలుగు వాటర్ ప్యూరిఫైర్లను ఆయన ప్రారంభించారు. కదిరి ప్రాంతంలోని మూడు బీసీ, ఒక ఎస్సీ హాస్టల్ కోసం వీటిని పంపిణీ చేశారు.