VIDEO: గుగూల్ ఒప్పందంపై కృతజ్ఞత ర్యాలీ
VSP: విశాఖలో గుగూల్ సంస్థ ఏర్పాటుపై ఏపీ నిరుద్యోగ యువత రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధర్యంలో మంగళవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుగూల్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ పాత్ర ఎంతో ఉందన్నారు.