ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
BPT: చినగంజాంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు ఉలిచి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉలిచి ఏసుబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు శిఖరం కోటయ్య, మండల జనరల్ సెక్రటరీ మోటమర్రి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచారు.