అనుమానస్పద స్థితిలో బాలుడి మృతదేహం

అనుమానస్పద స్థితిలో బాలుడి మృతదేహం

AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. పోలవరం కాలువ దగ్గర మృతదేహం ఉన్న ఫొటోలు SMలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వెళ్లేలోపు బాలుడి మృతదేహం మాయమైంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు కొండకింద పొదల్లో మృతదేహం గుర్తించారు. మరకలు శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో నాటుతుపాకీతో కాల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.