రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

WNP: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. అప్పంపల్లి గ్రామానికి చెందిన మధు (35) లాల్కోట నుంచి బైక్‌పై వడ్డేమాన్ వస్తుండగా, మార్గమధ్యంలో డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు డీసీఎంను అదుపులోకి తీసుకున్నారు.