భిక్షాటన చేసి నిరసన తెలిపిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు
MNCL: తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు భిక్షాటన చేసి బుధవారం నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం తక్షణమే సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవాలని, డిమాండ్ చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు.