మాజి సైనికుల వైద్య సేవల కోసం ECHS మంజూరు

VZM: మాజీ సైనికుల వైద్యసేవల కోసం కేంద్ర రక్షణ శాఖ ECHS పోలి క్లినిక్ మంజూరు చేసినట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు తెలిపారు. మంగళవారం బొబ్బిలి మాజీ సైనికుల కార్యాలయంలో నిర్వహించిన సైనిక దర్చార్‌లో సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. మాజీ సైనికులకు వైద్య సేవలకు మిమ్స్‌ని ECHS ఆసుపత్రిగా గుర్తించారన్నారు.