తెలుగు గంగ 19వ బ్లాకు ఉపకాలవ క్రింద ఉన్న పంట కాలువకు గండి.

NDL: రుద్రవరం తెలుగు గంగ ప్రధాన కాలువ 19వ బ్లాక్ ఉపకాల్వ కింద ఉన్న పంట కాలువకు గండిపడడంతో వృధాగా నీరు ప్రవహిస్తుంది. ఆ పంట కాలువ క్రింది భాగాన అప్పనపల్లి, గోనంపల్లె, కొండమాయపల్లె, వెలగలపల్లె, రుద్రవరం గ్రామాలలోని రైతుల వారి పంట పొలాలకు సాగు నీరు అందకపోవడంతో వారి పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారాయి. అధికారులు వెంటనే మరమత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.