ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
కోనసీమ: అమలాపురం పట్టణంలో సర్క్యులర్ బజార్ వద్ద ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని అన్నారు.