'కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించండి'

CTR: కుష్ఠు వ్యాధి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉందని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అన్నారు. చౌడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. లెప్రసి, టి.బి కేసుల వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి కుష్ఠు వ్యాధి లక్షణాలను ప్రజలకు వివరించాలని సూచించారు.