అమ్మవారి దర్శించుకున్న కోరుకొండ సీఐ దంపతులు

అమ్మవారి దర్శించుకున్న  కోరుకొండ సీఐ దంపతులు

E.G: కోరుకొండ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ మూర్తి సోమవారం గోకవరం దేవిచౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం అమ్మవారి సన్నిధికి విచ్చేసిన ఆయనకు ప్రధాన అర్చకులు జగన్నాధ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా సీఐ ఆకాంక్షించారు.