పనులు నాణ్యత మౌలిక వసతులుపై కలెక్టర్ సూచన
KMM: విద్యార్థులకు ఆధునిక సదుపాయాలతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం రూరల్ పోన్నేకల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులను ఇవాళ కలెక్టర్ పరిశీలించారు. పనుల నాణ్యత, మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాలను అందుబాటులోకి తేవాలన్నారు.