పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు
TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. యువత కంటే వృద్ధులు, సీనియర్ సిటిజన్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.