సగరుల సామూహిక భవనాన్ని ప్రారంభించిన మేఘారెడ్డి

WNP: ఖిల్లా ఘనపురం మండల పరిధిలోని వెంకటం పల్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే మేఘారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డికి గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సగరుల సామూహిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని దుర్గామాతను ఆయన దర్శించుకున్నారు.