జింగిడాపల్లిలో ఆసుపత్రి ఉంది.. వైద్య సిబ్బంది లేరు!

జింగిడాపల్లిలో ఆసుపత్రి ఉంది.. వైద్య సిబ్బంది లేరు!

ASR: పాడేరు మండలం ఐనడా పంచాయతీ జంగిడాపల్లిలో పీహెచ్‌సీ భవనం సిద్ధమైనా వైద్యులు సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. దీంతో 24 గ్రామాల గిరిజనులు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే ఇప్పటికీ డోలీ మోతలే దిక్కవుతున్నాయి. వెంటనే డాక్టర్లను, నర్సులను నియమించి జంగిడాపల్లి ఆసుపత్రి సేవలు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.