యుద్ధం ఎఫెక్ట్.. 'X'లో సరికొత్త రికార్డు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' సరికొత్త మైలురాయిని చేరుకుంది. నిన్న రికార్డు స్థాయిలో అత్యధిక మంది యూజర్లు ఈ వేదికను వినియోగించారని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెల్లడించారు. తాజా అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జనం 'X'పై భారీగా ఆధారపడటంతో ఈ రికార్డు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.