VIDEO: సాగు నీటిని విడుదల చేయాలని రోడ్డెక్కిన రైతులు
కృష్ణా: దాల్వా పంటకు నీటిని విడుదల చేయాలని బంటుమిల్లి మండలానికి చెందిన రైతులతో కలిసి రైతు సంఘాల నాయకులు శుక్రవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల్లో రెండో పంటుకు నీరు అందజేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని, నీటిని విడుదల చేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.