ఈనెల 12న చిన్నమండెంకు సీఎం చంద్రబాబు రాక
అన్నమయ్య: CM చంద్రబాబు ఈనెల 12న అన్నమయ్య జిల్లా చిన్నమండెం రానున్నారు. పేదల గృహప్రవేశాలు కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు నూతనంగా నిర్మించనున్న పక్కా ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు CM కార్యాలయం నుంచి శనివారం సంకేతాలు రావడంతో కలెక్టర్ ప్రశాంత్ కుమార్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.