నిజాంసాగర్ కాల్వలో పడి మహిళ మృతి
KMR: బీర్కూర్ మండలం దామరంచకు చెందిన బోయి మంజుల(42) అనుమానాస్పద మృతి చెందింది. మానసిక స్థితి సరిగా లేక ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె ఆధార్ కార్డు గురువారం నిజాంసాగర్ కాల్వ వద్ద లభించింది. ఇవాళ బొప్పాస్పల్లి శివారులో కాల్వలో మృతదేహం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.