చట్టబద్ధతకు తీర్మానం హర్షణీయం: షర్మిల
AP: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం హర్షణీయమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 'సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే.. మళ్లీ జగన్ లాంటోళ్లు వచ్చినా అమరావతి లేకుండా తీర్మానం చేశారు. ముందుచూపుతో తీర్మానం చేయడం మీ విజన్‌కు నిదర్శనం' అని పేర్కొన్నారు. అలాగే, రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి అని ప్రశ్నించారు.