మహిళల వేధింపులపై ఎస్పీ సత్వర స్పందన

మహిళల వేధింపులపై ఎస్పీ సత్వర స్పందన

కృష్ణా: మచిలీపట్నంలో సోమవారం జరిగిన “మీ కోసం” కార్యక్రమంలో మహిళల సమస్యలు ప్రధానంగా వినిపించాయి. ఎస్పీ ఆర్.గంగాధరరావు 33 ఫిర్యాదులు స్వీకరించి చట్టపరంగా త్వరిత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుడ్లవల్లేరు, అవనిగడ్డ నుంచి వచ్చిన మహిళలు భర్తల వేధింపులు, బెదిరింపులు, అదనపు కట్నం డిమాండ్లపై ఫిర్యాదు చేయగా, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.