వైభవంగా వార్షికోత్సవ పూజలు.. తరలివచ్చిన భక్తులు
RR: షాద్ నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ సంవత్సర వార్షికోత్సవ పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహహోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది.