బీసీ హాస్టల్ భోజనం పరిస్థితి ఇలా..!

బీసీ హాస్టల్ భోజనం పరిస్థితి ఇలా..!

GDWL: ధరూర్ మండలంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించిన భీమ్ ఆర్మీ మండల అధ్యక్షుడు ఈధన్న, భోజనం నాణ్యత కొద్దిగా పర్వాలేదని పేర్కొన్నాడు. అయితే, హాస్టల్‌లోని రూముల క్లీనింగ్ మాత్రం అద్వానంగా ఉందని ఆక్షేపించాడు. విద్యార్థులకు సరియైన వసతులు, పరిశుభ్రత కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.