కష్టపడి పనిచేసే వారికే పదవులు: ఎమ్మెల్యే
NGKL: కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలకు పదవులు, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట మండల అధ్యక్షుడు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షుడు ఖాదర్ను ఆయన శాలువాతో సన్మానించారు. పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, నాయకులు ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు.