'సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం'
SKLM: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఇచ్చాపురం MLA, ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. ఇవాళ ఇచ్చాపురం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు చూపుతున్న సేవ అభినందనీయమని అన్నారు.