పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: నాగబాబు
కాకినాడ: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృతంగా పర్యటించారు. కుమార్‌పురంలోని గోకులం గ్రాండ్ వద్ద నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్‌ఛార్జ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి వార్డు స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు.