దొంగతనం కేసులో ఇద్దరు మహిళల అరెస్టు
NZB: పోతంగల్ మండల కేంద్రంలో గత నెల24న జరిగిన దొంగతనం కేసులో శనివారం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్టు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.72,557 విలువ గల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు.