VIDEO: ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన
SKLM: మందస మండలం పిడిమి గ్రామంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీవో వెంకటేష్ గ్రామంలోని రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలతో సహా గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'మాకు ఎయిర్‌పోర్ట్ వద్దు.. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి' అని నినాదాలు చేశారు.