మహా కుంభాభిషేకానికి ఆహ్వానం
BDK: అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న మహా కుంభాభిషేక వేడుకలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వామిని కలిసి కార్యక్రమ వివరాలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో ఈ మహోత్సవాలు విజయవంతం కావాలని కోరుకున్నారు.